జుట్ట రాలడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కొన్ని మనం నియంత్రించవచ్చు. మరి కొన్ని మన చేతిలో ఉండవు.

జుట్టు రాలేందుకు కొన్ని మన అలవాట్లు, జీవనశైలి వంటి కారణాలను మనం కచ్చితంగా నియంత్రించవచ్చు.

జుట్టు రాలేందుకు కారణమయ్యే వాటిలో మనం నియంత్రించగలిగే వాటి గురించి తెలుసుకుందాం.

చక్కెర వినియోగం వల్ల బరువు పెరగడం, మధుమేహ సమస్య పెరగడం మాత్రమే కాదు జుట్టు కూడా రాలుతుంది.

రక్తంలో ఎక్కువైన చక్కెర శాతం రక్త ప్రసరణ మీద ప్రభావం చూపుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు అందక రాలిపోతాయి.

ఆహారంలో తీసుకునే కార్బోహైడ్రేట్లు పెరిగినపుడు తప్పకుండా రక్తంలో చక్కెర పెరుగుతుంది.

అంతేకాదు కార్బోహైడ్రేట్ల వల్ల ఆండ్రోజెన్, టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది పురుషుల్లో జుట్టురాలేందుకు ప్రధాన కారణం.

ఆల్కహాల్ అలవాటు జుట్టు రాలేందుకు కారణం కావచ్చు. ఆల్కహాల్ వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుంది.

శరీరంలో నీటి శాతం తగ్గితే స్కాల్ప్ మీద సెబమ్ స్రవించడం తగ్గుతుంది. ఫలితంగా జుట్టు పెళుసుబారి రాలిపోతుంది.

అదనపు చక్కెరలు కలిగిన ఫిజిడ్రింక్స్ వల్ల జుట్టు ఆరోగ్యం పాడవుతుంది.

వీటి వినియోగం జుట్టుకు పోషకాల ప్రసారంలో అడ్డుతగులుతాయి. ఫలితంగా జుట్టు రాలుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels