‘దీపికా పడుకోన్ దోశె’ ధరెంతో తెలుసా?



సెలెబ్రిటీల పేరు మీద తినుబండారాలను అమ్మేసుకుంటున్నారు చాలా మంది వ్యాపారులు.



అమెరికాలోని టెక్సాస్‌లో ఓ రెస్టారెంట్లో దీపికా పడుకోన్ పేరుతో దోశెను అమ్ముతున్నారు.



దాని రేటు మన రూపాయల్లో రూ.700. ఈ దోశెకు చాలా డిమాండ్ ఉంది.



ఢిల్లీలో సన్నిలియోన్ పేరుతో మలాయ్ చాప్ అనే ఆహారాన్ని అమ్మేస్తున్నారు.



మియా ఖలీఫా మలాయ్ చాప్ కూడా అందుబాటులో ఉంది.



ఢిల్లీలోనే కరీనా కపూర్ పేరుతో పిజాను అమ్ముతున్నారు.‘కరీనాస్ సైజ్ జీరో పిజా’ అని పేరు పెట్టారు.



అమెరికాలో వెస్ట్ హాలీవుడ్ ప్రాంతంలోని ‘ప్రియాంక చోప్రా మిల్క్ షేక్’ అమ్ముతున్నారు.



ఒమన్ దేశంలో ఓ కాక్ టెయిల్‌కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు పెట్టారు.



ముంబైలోని నూర్ మహమ్మది రెస్టారెంట్ కి వెళితే కచ్చితంగా సంజూ బాబా చికెన్ కర్రీని ఆర్డర్ చేయండి. టేస్ట్ అదిరిపోతుందట.