29-06-2022
రాశిఫలాలు



మేషం
ఆఫీసు పనిలో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపార వృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుకూలమైన రోజు. రోజంతా కొంత హడావుడిగా ఉంటారు. కుటుంబ విషయాల గురించి తొందరపడకుండా సీరియస్‌గా నిర్ణయాలు తీసుకోండి.



వృషభం
ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు.మీ పని పట్ల శ్రద్ధ వహిస్తారు. సహోద్యోగుల కారణంగా కొంత ఇబ్బంది పడతారు. ప్రేమసంబంధాలు సరిగా ఉండవు. మంచి సంభాషణ కొనసాగించండి. నిరుద్యోగులకు మంచి సమయం.



మిథునం
సామాజిక రంగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. జీవిత భాగస్వామికి మీపై ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.



కర్కాటకం
ఈ రోజంతా కొంత గందరగోళంలో ఉంటారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించి నడుస్తున్న కేసులు ఆలస్యం అవుతాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించాలి. కొంతమంది మిమ్మల్ని నిందించవచ్చు. ఇనుముకి సంబంధించిన వ్యాపారులు నష్టపోతారు.



సింహం
వ్యాపారానికి సంబంధించి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం మారాలనుకున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు మీకు కలిసొస్తుంది. జీవిత భాగస్వామిని మాటలతో మెప్పిస్తారు.



కన్య
రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులతో మీ బంధం దృఢంగా ఉంటాయి. ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. వినయంతో కూడిన స్వభావంతో ఆకట్టుకుంటారు. స్నేహితులతో తీవ్రమైన విషయాలు చర్చించవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి.



తులా
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే సూచనలున్నాయి. మీ మాటల ప్రభావం ఇతరులపై ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.



వృశ్చికం
మీ వ్యక్తిగత జీవితంలో ఎవరి జోక్యాన్ని సహించకండి. తెలివైన వ్యక్తుల సలహాలు పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవసరం లేని దగ్గర మీ సామర్థ్యాన్ని ప్రదర్శించవద్దు.



ధనుస్సు
మీ దినచర్యను మార్చుకునే ఆలోచన చేయడం మంచిది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. తంత్రానికి సంబంధించిన మంత్రంపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో మీ సలహాకు ప్రాధాన్యత ఉంటుంది. మీకు సహాయపడే వ్యక్తులను మీరు గుర్తిస్తారు.



మకరం
బంధువులతో సత్సంబంధాలుంటాయి.కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.విద్యార్థులు శుభ ఫలితాలు పొందుతారు. మీరు ప్రయాణం చేయవలసి రావొచ్చు. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఇంట్లో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు.



కుంభం
ఈ రోజు మీకు ధనలాభం ఉంటుంది. కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కుటుంబంలో ఏదైనా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. కార్యాలయంలో బాస్ మీపై కోపంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ పై ఆందోళన ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోండి.



మీనం
కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి భావాలను పరిగణలోకి తీసుకోండి. నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థుల్లో మనోధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు మంచి రోజు. కోపాన్ని నియంత్రించుకోవాలి.