డయాబెటిస్ రోగుల కోసం కాకరకాయ పల్లీ కారం రెసిపీ

కాకరకాయలు - అరకిలో
వేరుశెనగపలుకులు- అరకప్పు
ధనియాలు - రెండు స్పూన్లు
జీలకర్ర - రెండు స్పూన్లు
ఎండు మిర్చి - పది

కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - పది
నూనె - మూడు స్పూనులు
పసుపు - ఒక స్పూను

కాకరకాయలను చెక్కు తీసేసి గుండ్రంగా, పలుచగా కోసుకోవాలి.

వేరుశెనగపలుకులు, ధనియాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేయించి, కాస్త ఉప్పు వేసి పొడిలా చేసుకోవాలి. ఇదే పల్లీ కారం.

స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక కాకరముక్కలు వేసి వేయించాలి.

కాకరకాయ ముక్కలు వేగాక ముందుగా చేసి పెట్టుకున్న పొడిని కలపాలి.

చిన్న మంట మీద ముక్కలు వేయించాలి. పదినిమిషాలు వేయించాక స్టవ్ కట్టేయాలి.

దీన్ని పప్పన్నం లేదా, సాంబారన్నంతో నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తిన్నా కూడా రుచి బావుంటుంది.