కాకరకాయల్లో విటమిన్లు, ఖనిజాలు ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

కానీ ఇవి చేదుగా ఉంటాయనే వంకతో చాలామంది వాటిని తినడం మానేస్తారు.

అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వాటిలోని చేదు తగ్గించి టేస్టీ రెసిపీలు చేసుకోవచ్చు.

కాకరకాయ పైన ఉండే గరుకైన చర్మాన్ని తీసేస్తే కొంతవరకు చేదు తగ్గుతుంది.

కాకరకాయల్లోని గింజలు తీసివేసిన కూడా చేదు అంతగా ఉండదు.

కాకరకాయ ముక్కల్లో ఉప్పు, పసుపు కలిపి కాసేపు ఉంచి తర్వాత కడిగేయాలి.

చింతపండు గుజ్జులో కాకరకాయ ముక్కులు నానబెట్టడం వల్ల చేదు తగ్గుతుంది.

ఈ చిట్కాలతో ఫాలో అయితే కాకరకాయలను అందరూ తినేయొచ్చు. (Images Source : Unsplash)