చేప ముక్కలు - నాలుగు అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక చెంచా పసుపు - చిటికెడు కారం - ఒక స్పూను ధనియాల పొడి - ఒక స్పూను జీలకర్ర పొడి - పావు స్పూను ఉప్పు - రుచికి సరిపడా కరివేపాకులు - గుప్పెడు
చేపను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు కలిపి కడగడం వల్ల వాసన పోతుంది.
ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు కలిపి ముద్దలా చేయాలి. కాస్త నీళ్లు కలిపి మరీ చిక్కగా కాకుండా చేయాలి.
చేపముక్కలకి ఈ మిశ్రమాన్ని పట్టించి ఓ అరగంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.
తరువాత వెడల్పుగా ఉండే కళాయిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి చేప ముక్కలు వేయాలి.
ఒక్కో చేపముక్క వేసి రెండు వైపులా వేయించుకోవాలి. కరివేపాకులు కూడా వేయాలి.
రెండు వైపులా బ్రౌన్ రంగులోకి మారేవరకు ఉంచి తీసేయాలి.