మేషం ఈ రోజు అనారోగ్య సమస్యలతో బాధపడతారు. టైమ్ ని ఫాలో అవండి.ఎవ్వరినీ నమ్మి మోసపోవద్దు. సహోద్యోగులతో అభిప్రాయ విభేదాలుండొచ్చు. తెలియని వారితో సన్నిహితంగా ఉండకండి. వ్యాపారులకు బాగుంటుంది. ప్రభుత్వ పనులు పూర్తి చేయగలుగుతారు.
వృషభం సంతోష వనరులు పెరుగుతాయి. కొత్తగా ప్లాన్ చేసుకున్న పనులు ప్రారంభిస్తారు.షేర్ మార్కెట్ పెట్టుబడులకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు ఓ శుభవార్త వింటారు. పని ఒత్తిడి మీపై తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మిథునం ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు వ్యక్తుల సహవాసం వల్ల డబ్పు కోల్పోతారు. .చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణం చేయవలసి రావొచ్చు. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
కర్కాటకం వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలొస్తాయి. ఇంట్లో ఉన్న వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో భాగస్వాముల వైఖరిని గమనించండి. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి.
సింహం మీకు తెలియని అడ్డంకి వల్ల ఇబ్బంది ఎదురైతే హనుమంతుని పూజించడం ద్వారా మంచి జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జీవితభాగస్వామిని మోసం చేయకండి.వివాహేతర సంబంధాలు కుటుంబ జీవితంలో ఉద్రిక్తతను కలిగిస్తాయి.
కన్యా ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.దంపతుల మధ్య బంధం బలపడుతుంది. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వ్యాపారానికి సంబంధించి కొత్త సమాచారం తెలుసుకుంటారు. ధనలాభం ఉంటుంది.
తులా వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. తలపెట్టిన పని ఆగిపోవచ్చు. ఎవరి పట్లా తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. దాంపత్య సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది. ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోండి.
వృశ్చికం వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు.కెరీర్‌లో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. స్నేహితుల సహకారంతో మీ పని సులువవుతుంది.మీ జీవిత భాగస్వామి కారణంగా సంతోషంగా ఉంటారు.
ధనుస్సు వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయాలి అనుకుంటే ఇదే మంచిసమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. రెండు రకాల ఆలోచనలు మనసులోంచి తీసేయండి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తారు.
మకరం శత్రువులపై నిఘా ఉంచండి. ఇంటర్వూలకు హాజరయ్యేవారు విజయం సాధిస్తారు. ముందుగా ప్లాన్ చేసుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్య పరంగా ఫిట్‌గా ఉంటారు. అనవసర మాటలు వద్దు. ప్రసంగాలివ్వకండి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది.
కుంభం కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. మీ సంబంధాలలో నిజాయితీగా ఉండండి. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. లావాదేవీలు జరిపేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీనం మీ పని పట్ల విధేయతతో ఉండండి. విద్యార్థులు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. మీ మనస్సులో మంచి ఆలోచనల ప్రభావం ఉంటుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభిస్తుంది.