బొజ్జ నిండా తిన్నాక ఇబ్బందిగా అనిపిస్తోందా... ఇలా చేయండి
బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, విందుభోజనాలు... ఇవన్నీ పొట్ట నిండేలా లాగించేస్తారు చాలా మంది.
పొట్ట నిండాక అసౌకర్యంగా ఫీలవుతుంటారు. అటువంటి పరిస్థితిలో వెంటనే తేలికగా అనుభూతి చెందడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
బ్రేక్ ఫాస్ట్ కావచ్చు, లంచ్ లేక డిన్నర్ ఏదైనా కావచ్చు అతిగా తిన్నాక కచ్చితంగా కాసేపు నడవండి.
పావు స్పూను వాము గింజలు, పావుస్పూను జీలకర్ర, పావు స్పూను సోంపు గింజలు, చిన్న ఇంగువ ముక్క కలిపి మెత్తని పొడిలా చేయండి. ఈ పొడిని కొంచెం నీటిలో కలిపి నోట్లో వేసుకుని నమిలి మింగండి.
ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం, చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి కలపాలి. ఆ నీటిని మెల్లగా సిప్ చేయండి. ఒకేసారి తాగేయకండి.
భోజనం చేశాక కూర్చోవడం లేదా కాసేపు నడవడం ఉత్తమం. పడుకోవడం, నిద్రపోవడం చేయద్దు.