ఫిబ్రవరి 14 వసంతపంచమి పరిహారాలు - మీ రాశి ఆధారంగా!

వసంత పంచమి రోజు మేష రాశివారు సరస్వతీ కవచాన్ని పఠించండి. చదువుపై ఏకాగ్రత కలిగిస్తుంది . నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

వృషభ రాశివారు సరస్వతీ దేవికి తెల్ల చందనం , పసుపు రంగు పూలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల పురోభివృద్ధికి వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి

మిధున రాశివారు సరస్వతీ దేవికి కలం సమర్పించి ఈ కలాన్ని ఉపయోగించి శుభకార్యాలు ప్రారంభించండి విజయవంతమవుతాయి.

ఫిబ్రవరి 14 వసంతపంచమి రోజు కర్కాటక రాశివారు సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఖీర్ నైవేద్యంగా పెట్టవచ్చు.

సింహ రాశి ఈ రోజు సరస్వతీ పూజలో భాగంగా గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి.

కన్యా రాశివారు వసంత పంచమి రోజు పేద పిల్లలకు పెన్నులు, పుస్తకాలు , పెన్సిళ్లు దానం చేయండి.

తులారాశివారు పసుపు లేదా తెలుపు రంగుల వస్త్రాలను బ్రాహ్మణుడికి దానం చేయండి. పూజలో పసుపు రంగు లడ్డూలను సమర్పించండి.

వృశ్చిక రాశివారు సరస్వతీ దేవిని పూజించి, కలం సమర్పించండి. పూజ అనంతరం శుభ కార్యాలకు ఈ పెన్ను ఉపయోగించండి

ధనుస్సు రాశి వారు శారదా తల్లిని ప్రసన్నం చేసుకునేందుకు పూజ అనంతరం పసుపు రంగు స్వీట్ ను నైవేద్యంగా సమర్పించాలి

వసంత పంచమి రోజు మకర రాశివారు పేదలకు అన్నదానం చేయండి

కుంభరాశి వారు ఈ రోజు పేద పిల్లలకు విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయాలి

మీన రాశివారు బ్రాహ్మణులకు పసుపు రంగు దుస్తులు దానం చేయాలి. దీంతో కెరీర్‌లో మీకు ఎదురైన అడ్డంకుల నుంచి బయటపడొచ్చు
Image Credit: Pixabay