ప్రముఖ హీరోయిన్ శ్రద్ధా దాస్ తన లేటెస్ట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఆమె వైట్ డ్రస్‌లో వావ్ అనిపించే లుక్‌లో ఉన్నారు. వెకేషన్‌లో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. శ్రద్ధా కపూర్ నటించిన ‘పారిజాత పర్వం’ ఇటీవలే విడుదల అయింది. కానీ థియేటర్ల వద్ద ఆశించినంత హిట్ అవ్వలేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా అనేక భాషల్లో శ్రద్ధా కపూర్ సినిమాలు చేశారు. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ భాషల్లో శ్రద్ధా పలు సినిమాల్లో నటించారు. 2008లో అల్లరి నరేష్ సరసన నటించిన ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’ శ్రద్ధా కపూర్ మొదటి సినిమా. ఆ తర్వాత ‘ఆర్య 2’, ‘డార్లింగ్’ వంటి పెద్ద సినిమాల్లో కూడా శ్రద్ధా కనిపించారు. బాలీవుడ్‌లో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.