వామ్మో ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్ కాస్ట్ 5 లక్షలట.. ఎందుకో తెలుసా?
ప్రియాంక చోప్రా రీసెంట్గా Kering Foundation డిన్నర్‌కి అందమైన అవుట్‌ఫిట్‌లో అటెండ్ అయింది.
అయితే ఈ డ్రెస్ గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతుంది. ఎందుకంటే..
ఈ భామ ధరించిన ఈ బాడీ కాన్ డ్రెస్ ధర 5 లక్షల పైమాటేనట. దీని అసలు 6250 usd అంటే.. 5,24,762 రూపాయలు.
ysl..SAINT LAURENT ఈ డ్రెస్‌ని డిజైన్ చేసింది. ఈ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌజ్ 1961లో ప్రారంభమై.. బ్రాండ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రియాంక అటెండ్ అయిన ఈ డిన్నర్‌కి ఓ స్పెషాలిటీ ఉంది. ఉమెన్ రైట్స్ గురించిన ప్రస్తావన ఈ డిన్నర్లో జరిగనట్లు ప్రియాంక చెప్పుకొచ్చింది.
It was about more than just raising awareness, it was about taking decisive action to end violence against women and create a world where women can live without fear. అంటూ రాసుకొచ్చింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా డ్రెస్ కాస్ట్ గురించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది.
బాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ఉంటూ ప్రియాంక హాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకుంది.
వయసులో తన కన్నా చిన్నవాడైన నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. (Images Source : Instagram/priyankachopra)