హరిహరన్ పాడిన ''యమహానగరి కలకత్తా పూరి'' సాంగ్​ తెలుగులో బ్లాక్​ బస్టర్​ హిట్​.

ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ''నెల్లూరి నెరజాన'' సాంగ్ ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ సాంగ్.

'ప్రేమకలలు' సినిమాలోని ''వెన్నెలవే వెన్నెలవే'' సాంగ్ ప్రేమికుల ప్లే లిస్ట్​లో కచ్చితంగా ఉంటుంది.

''వస్తా నీ వెనుక.. ఎటైనా కాదనక'' సాంగ్​లో హరిహరన్ వాయిస్ అద్భుతంగా ఉంటుంది.

'శీను' సినిమాలోని ప్రేమంటే ఏమిటంటే సాంగ్​కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన 'సుస్వాగతం' సినిమా టైటిల్ సాంగ్​ని హరిహరన్ పాడిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

'బొంబాయి' సినిమాలో ''ఉరికే చిలుకా'' పాటను ఎంత బాగా పాడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'సఖి'లోని ''పచ్చందనమే పచ్చదనమే'' పాటను ఇప్పటికీ చాలామంది రింగ్​టోన్​గా పెట్టుకుంటారు.

ఇలా ఒకటా, రెండా.. పాడిన ప్రతి పాటలో తనదైన వైవిధ్యం చూపించడం ఆయనకే సాధ్యం.

హరిహరన్ తెలుగు పాటలు (Images Source : Instagaram/singerhariharana)