శారీ, బ్లౌజ్ డిజైన్, హెయిల్ స్టైల్ ఇలా ఉంటే ఏ పెళ్లికి వెళ్లినా అందరి చూపూ మీవైపే!

ఓ పెళ్లికి అటెండైన ఆషికా రంగనాథ్ షేర్ చేసిన ఫొటోస్ ఇవి..సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్

కూల్ అండ్ బ్యూటిఫుల్ లుక్ అంటూ నెటిజన్లు ఆషికా అందాన్ని పొగిడేస్తున్నారు

Wedding shenanigans This look in my lens 👀 Ikykyk 🫢 Make up, hair & styling - yours అంటూ పోస్ట్ పెట్టింది

కన్నడ బ్యూటీలంతా టాలీవుడ్ లో వెలుగుతున్నారు కానీ ఆషికా రంగనాథ్ కి అదృష్టం కలసిరాలేదు

స్మాల్ స్క్రీన్ పై కెరీర్ ప్రారంభించిన ఆషికా సిల్వర్ స్క్రీన్ పై కూడా వెలగాలని ఆశపడింది

కన్నడలో మదగజ, అవతార పురుష, గరుడ సినిమాల్లో నటించి స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకుంది

కన్నడ నుంచి తమిళంలో అడుగుపెట్టిన తర్వాత తెలుగులో కళ్యాణ్ రామ్ అమిగోస్ లో ఆఫర్ అందుకుంది

అమిగోస్ ఫ్లాప్ కావడంతో ఆషికాను ఎవరూ పట్టించుకోలేదు..ఆ తర్వాత నా సామిరంగ తో హిట్ అందుకుంది

తెలుగులో వెలగాలనే ఆషికా ఆశ ఎప్పటికి నెరవేరుతుందో వెయిట్ అండ్ సీ...