రాత్రి బిర్యానీలు తింటే ఈ బాధలు తప్పవు

తెలుగు రాష్ట్రాల్లో బిర్యానీ అభిమానులు ఎక్కువ.

కంటికి ఇంపుగా కనిపించే బిర్యానీలు మనసును లాగేస్తాయి.

బిర్యానీలు తరచూ తినడమే అనారోగ్యకరం. అలాంటిది రాత్రిపూట తింటే మరీ అనర్థం.

బిర్యానీలో నూనెను ఎక్కువ శాతం వాడతారు. అలాగే రకరకాల మసాలాలు అధికంగా దట్టిస్తారు. కాబట్టి బిర్యానీని అధికంగా తింటే ప్రేగులకు, అలాగే మొత్తం జీర్ణవ్యవస్థకు హాని కలగడం ఖాయం.

ప్రతికూల ప్రభావాలు ఒక్కోసారి నాలుగైదు రోజులకే అజీర్తి రూపంలో బయటపడతాయి.

కొందరిలో మాత్రం ఏళ్ల తరువాత పెద్ద అనారోగ్య సమస్యగా బహిర్గతమవుతాయి. కాబట్టి బిర్యానీని వారానికోసారి మాత్రమే తింటే మంచిది.

కొందరు బిర్యానీకి మంచి రంగు రావడం కోసం ఆర్టిఫిషియల్ రంగును వాడతారు.అందులో ఒకటి టర్ ట్రాజెన్.

ఇది సింథటిక్ తో తయారయ్యే ఓ రసాయనం. నీటిలో ఇట్టే కరిగిపోతుంది. బిర్యానీ వండాక చివర్లో రంగు కోసం చల్లుతారు.

టర్ ట్రాజెన్ తినడం వల్ల ఆస్తమా, దద్దుర్లు, క్యాన్సర్ వంటివి రావచ్చని చెబుతున్నారు నిపుణులు.