తిన్న ఆహారం జీర్ణమవ్వడం కోసం చాలామంది సోంపు తింటారు. కొందరు బరువు తగ్గడం కోసం సోంపు నీళ్లు కూడా తాగుతారు. ఇవన్నీ పక్కనపెడితే సోంపు నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. జీర్ణక్రియ వేగాన్ని పెంచి.. కొవ్వు చేరకుండా చేస్తుంది. దీనిలోని ఫైబర్ మీకు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. సహజమైన డిటాక్సిఫయర్గా పనిచేసి.. శరీరంలోని మలినాలు బయటకు పంపిస్తుంది. సోంపులోని యాంటీ ఆక్సిడెంట్లు హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. మధుమేహం ఉన్నవారు సోంపు రెగ్యూలర్గా తీసుకుంటే మంచిది. (Image Source : Pinterest)