ఈ పదార్థాలు ముఖానికి పూస్తే సమస్యలు తప్పవు

పసుపు,పండ్ల రసాలు,పాలు, పెరుగు... ఇలా వంటింట్లో దొరికే ఎన్నో పదార్థాలను అందానికి వాడుతుంటారు.



వాటిని స్ర్కబ్ లుగా, క్లెన్సర్లుగా, టోనర్లుగా, ఫేస్ ప్యాక్ లుగా వాడుతుంటారు.

వంటగదిలో దొరికే కొన్ని పదార్థాలలో ముఖానికి అప్లై చేయకూడనివి కొన్ని ఉన్నాయి.

నిమ్మరసాన్ని నేరుగా ముఖచర్మంపై రాయకూడదు. ఇందులో అధిక ఆమ్ల స్వభావం ఉంటుంది. ఇది pH బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల చర్మంపై అలెర్జీలు, పొడిగా మారడం అధికమవుతుంది.



చక్కెరతో రుద్దడం వల్ల చర్మంపై వాపు, చికాకు, మంట, పొడి చర్మం సమస్యలు మొదలవుతాయి. మొటిమల సమస్యకు ఉప్పు,చక్కెర ఎప్పుడూ ఉపయోగించకూడదు.

బేకింగ్ సోడాను ఫేస్ మాస్క్‌గా లేదా స్క్రబ్‌గా వాడడం వల్ల చర్మంపైన ఉండే నూనెను పూర్తిగా తొలగిస్తుంది. ఆ నూనె పూర్తిగా పోతే ఇన్ఫెక్షన్లు, మొటిమలు బారిన పడే అవకాశం ఉంది.

దాల్చినచెక్క పొడిని నేరుగా చర్మంపై రాయకూడదు.

దాల్చినచెక్క పొడిని నేరుగా చర్మంపై రాయకూడదు.