నెలసరిలో ఇవి తినకూడదు నెలసరి కొంతమందికి సాఫీగా సాగుతుంది కానీ, మరికొందరికి మాత్రం నరకం చూపిస్తుంది. అతిగా బ్లీడింగ్ అవ్వడం, తీవ్రమైన పొత్తి కడుపు నొప్పి, వికారం, మూడ్ స్వింగ్స్, ఒళ్లు బరువుగా ఉండడం ... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మీరు తీసుకునే ఆహారం కూడా ఆ మూడు రోజులు చాలా మార్పులకు కారణం అవుతుంది. కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రింకులు వంటివి తాగడం మానేయండి. కాఫీ, టీలు కూడా తగ్గించాలి. వాటిలో ఉండే కెఫీన్ నొప్పులను మరింత పెంచుతుంది. ఆ మూడు రోజులు కూరల్లో, వంటకాల్లో ఉప్పు తక్కువగా వేసుకోవడం ప్రారంభించండి. మాంసాహారం, పాల ఉత్పత్తులు కూడా తగ్గించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కొవ్వులు ఈస్ట్రోజన్ హార్మోన్ మీద అధిక ప్రభావాన్ని చూపిస్తాయి. పుల్లని ఆహారాన్ని కూడా దూరం పెట్టాలి. నువ్వులు, బొప్పాయిలను కూడా ఆ మూడు రోజులు దూరంగా పెట్టాలి. లేకుంటే బ్లీడింగ్ అతిగా అవుతుంది. ఆ మూడు రోజులు సాత్వికాహారాన్ని తినాలి.