ఎక్కువగా ఏడిస్తే హార్ట్‌ ఎటాక్‌ వస్తుందా?

మానసిక సమస్యలు శారీరక వ్యవస్థలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది.

ఎక్కువ ఆందోళనకు గురయ్యే వారిలో సెరిటోనిన్‌ విడుదలై జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది.

తీవ్రమైన దుఃఖం గుండె, రక్తప్రసరణ వ్యవస్థ ప్రభావితం చేస్తుంది.

మానసిక ఉద్వేగాలు కొందరిలో గుండెజబ్బులకు దారితీస్తాయి.

ఒకసారి గుండెపోటు వచ్చినవారిలో మానసిక సమస్యలు ఉంటే మళ్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ.

మానసిక ఒత్తిడి కలిగినప్పుడు రక్తపోటులోనూ తేడాలు ఏర్పడుతాయి.

మానసిక ఇబ్బందులు కొన్నిసార్లు ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి.

డిప్రెషన్‌ లో ఉన్నప్పుడు మెడనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి కలిగే అవకాశముంది. All photos Credit: Pixabay.com