మేషం మేష రాశివారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు అస్సలు ఆలోచించరు. చేయాలంటే చేసేయాలంతే..ఇది ఒక్కోసారి బెడిసికొట్టి బాధపడతారు.
వృషభం వృషభ రాశివారు మహా సోమరులు. చేద్దాంలే, చూద్దాంలే అన్న బ్యాచ్ కి చెందుతారు. కొంపలంటుకుపోతున్నా కూల్ గా ఉండటం వల్ల కొన్నిసార్లు నష్టపోయినా వీళ్ల స్వభావం ఇంతే మరి మార్చులోలేరు. అందుకే వీరి జీవితం కూడా నెమ్మదిగా సాగుతుంది
మిథునం మిథున రాశివారు హడావుడికి మారుపేరు. వీళ్లకి మామూలు తొందరపాటు కాదు..చకచకా పనులు చేసేస్తారు కానీ దానివల్ల మిస్టేక్స్ జరుగుతాయని అస్సలు ఆలోచించరు. అయితే తప్పులు చేయాలని చేయరు కానీ అలాజరిగిపోతాయంతే..
కర్కాటకం కర్కాటక రాశివారు చాలా సున్నిత మనస్కులు. కొన్నిసార్లు సౌమ్యంగా కనిపిస్తారు. వీళ్లెంత సౌమ్యులంటే వారికి కష్టం వచ్చి గట్టిగా మాట్లాడాల్సిన సమయంలోకూడా వారికి వారు సపోర్ట్ చేసుకోరు.
సింహం అడవికి రాజు సింహం అయితే..మాకు మేమే రాజు అన్నట్టుంది సింహరాశి వారి తీరు. వీళ్లకి చాలా ఇగో. ఎవ్వర్నీ లెక్కచేయరు. తమకు తామే సాటిఅన్నట్టు వ్యవహరిస్తారు. ఆడంబరంగా జీవించడం వీరికి ఇష్టం. అందుకే వీరు అందరికీ అహంకారుల్లా కనిప్తారు.
కన్య పద్దతిగా ఉండాలనే ఆలోచనతో మనసులో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు కానీ గీసుకున్న గీతనుంచి బయటకు రారు. ఫైనల్ గా సొసైటీలో పద్ధతైన మనుషులు అనిపించుకుంటారు లెండి.
తుల ప్రతీ విషయాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అనుకుంటారు..గట్టిగా ఫిక్సవుతారు..కానీ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి తేలిపోతారు. అటు ఇటు ఊగిసలాడతారు.
వృశ్చికం వీరికి అపారమైన తెవివితేటలుంటాయి కానీ సరిగా మాట్లాడటం చేతకాదు. అవసరమైన సందర్భాల్లో కూడా తమ వాయిస్ వినిపించాలని అనుకున్నా ఒరిగిదేం ఉండదు.
ధనస్సు ఊరందరిదీ ఓదారి ఉలిపిరికట్టది ఓదారి అన్నట్టు...అందరిదీ ఓ ప్రపంచం..ధనస్సు రాశివారిది మరో ప్రపంచం. వీరి ప్రపంచంలో వీరు ఉంటారు. అందుకే అందరకీ మూడీగా కనిపిస్తారు.
మకరం మకరరాశి వారికి కోపం, ఫ్రస్ట్రేషన్ చాలా ఎక్కువ. అయితే దీనివల్ల వారెంత నష్టపోతారన్నది పక్కనపెడితే కోపం, ఫ్రస్ట్రేషన్ ని మాత్రం ఎప్పటికప్పుడు ఎదుటివాళ్లపై తీర్చేసుకోవడం వీళ్ల బలహీనత.
కుంభం ఈ రాశివారు అంతర్ముఖులు. వీళ్ల మనసులో బయటపడని భావాలెన్నో ఉండిపోతాయి. నిండుకుండ తొణకదు అన్నట్టు కుంభ రాశివారు బయటకు తొణకరు, బెణకరు...
మీనం వీళ్లు మనసులో ఏ క్షణం ఏం ఆలోచిస్తారో తెలియదు కానీ మనసు చెప్పిందే చేస్తారు. అంటే వీరి ఆలోచనలే ఒక్కోసారి వీరికి బలమైతే..ఇంకోసారి బలహీనతలుగా మారతాయి...