పీరియడ్స్ సమయంలో పెరుగు తింటే ఏమవుతుంది?



మహిళలకు నెలానెలా పీరియడ్స్ సమయంలో ఎన్నో సమస్యలు.



పీరియడ్స్ సమయంలో పెరుగు తినకూడదనే అపోహ ఎలా పుట్టిందో తెలియదు కానీ, చాలా మంది మహిళలు ఆ మూడు రోజులు పెరుగును దూరం పెడతారు.



పెరుగు తినకూడదనేది పూర్తిగా అపోహ. కచ్చితంగా తినాల్సిన ఆహారం ఇది.



పెరుగు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలు సాధారణ రోజుల్లోనే కాదు పీరియడ్స్ వేళల్లో కూడా కలుగుతాయి.



పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ పొట్ట, పేగుల ఆరోగ్యానికే కాదు, మహిళల జననాంగాల శుభ్రతకు కూడా చాలా అవసరం.



పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ పొట్ట, పేగుల ఆరోగ్యానికే కాదు, మహిళల జననాంగాల శుభ్రతకు కూడా చాలా అవసరం.



ఇందులో క్యాల్షియం, మెగ్నిషయం కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు పెరుగు తినడం వల్ల ఆ సమయంలో వచ్చే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది.



పెరుగు వల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.



కాబట్టి పెరుగు తినకూడదనే అపోహలను మాని ఆ మూడు రోజులు ఓ కప్పు పెరుగు కచ్చితంగా తినండి. మీకే తేడా తెలుస్తుంది.