హీరోయిన్ ధన్యా బాలకృష్ణకు పెళ్ళి అయ్యిందా? ఈ మధ్య ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన న్యూస్! దర్శకుడు బాలాజీ మోహన్, ధన్యా బాలకృష్ణ పెళ్ళి చేసుకున్నారని నటి కల్పికా గణేష్ ఓ వీడియోలో చెప్పారు. కల్పిక మాటలు జనాలకు షాక్ ఇచ్చాయి. ధన్యా బాలకృష్ణ దీనిపై ఏం మాట్లాడలేదు. చెన్నై హైకోర్టును ఆశ్రయించిన బాలాజీ మోహన్... తమ వ్యక్తిగత జీవితాలపై కల్పిక మాట్లాడకుండా చూడాలని కోరారు. బాలాజీ మోహన్ పిటిషన్ ద్వారా అతడికి, ధన్యా బాలకృష్ణకు పెళ్ళైన మాట నిజమని తెలిసింది. బాలాజీ మోహన్ తొలి సినిమా 'లవ్ ఫెయిల్యూర్'లో ధన్య నటించారు. అతడి దగ్గర సహాయ దర్శకురాలిగా కూడా చేశారు. బాలాజీ మోహన్ గతంలో ఒకరిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. అతడికి ధన్య రెండో భార్య. 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'లో హీరోయిన్ గా ధన్య నటించారు. పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసిన ఆవిడ... 'రెక్కీ', 'లూజర్' వెబ్ సిరీస్ లు కూడా చేశారు. ధన్య హీరోయిన్‌గా నటించిన 'జగమే మాయ' సినిమా ఈ మధ్య డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది.