‘పటాస్’ దర్శకుడు ‘పఠాన్’ స్టెప్పులు - అనిల్ రావిపూడి అల్లాడించాడుగా! దర్శకుడు అనిల్ రావిపూడి, ఫైట్ మాస్టర్ వెంకట్ ‘పఠాన్‘ డ్యాన్స్ తో అదరగొట్టారు. షూటింగ్ బ్రేక్ లో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. ‘పఠాన్‘ సినిమాలోని పాటకు వెంకట్ తో స్టెప్పులు వేయించాడు అనిల్. స్టెప్పులు వేసేందుకు వెంకట్ ముందుగా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత అనిల్ వెంకట్ కు స్టెప్పులు ఎలా వేయాలో చూపించాడు. స్టైప్ బై స్టెప్ ఎలా చేయాలో నేర్పించాడు. మూడో సారి ఫర్ఫెక్ట్ స్టెప్పులు అందుకున్నాడు. అనిల్ రావిపూడి, వెంకట్ ‘పఠాన్‘ స్టెప్పులు మీరూ చూసేయండి. Photos & Videos Credit: Anil Ravipudi/Instagram