శరీరంలో చక్కర స్థాయిలు పెరిగి, తగిన ఇన్సులిన్ అందకపోతే డయాబెటీస్ వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయి. అతి మూత్రం: రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కిడ్నీలు వడపోయలేవు. దానివల్ల తరచుగా మూత్రం వస్తుంది. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు: మూత్రంలో నిలువ ఉండే చక్కెర వల్ల ఈస్ట్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా సమస్యలు ఏర్పడతాయి. జననాంగాల వద్ద దురద: మర్మాంగాల వద్ద దురద లేదా నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి. ఊబకాయం: కొందరు అధిక బరువుతో మధుమేహానికి గురవ్వుతారు. కంటి చూపు సమస్యలు: కంటి చూపు మందగించినా డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి. పొడి గొంతు: గొంతు పొడిగా ఉన్నా, అతిగా దాహం, అతిగా ఆకలి వేస్తున్నా డయాబెటిస్‌గా అనుమానించాలి. చర్మం రంగు మారుతుంది: కొందరిలో చర్మం రంగు కూడా మారుతుంది. మెడ వద్ద చర్మం నల్లగా మారితే వైద్యుడిని సంప్రదించండి. అలసట, బరువు తగ్గడం: తీవ్రమైన అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వైద్యుడిని సంప్రదించండి పై లక్షణాల్లో ఒక్కటి కనిపించినా వైద్యుడిని సంప్రదించి తగిన సలహాలు, సూచనలు తీసుకోండి. వైద్యులు సూచించే ఔషదాలను మాత్రమే వాడండి.