ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు తప్పనిసరిగా కొని తెచ్చుకోండి!



ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి ఆశీర్వచనం లభిస్తుందని విశ్వాసం. వీటితో పాటూ ఈ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు మరికొన్ని ఉన్నాయి



ధన త్రయోదశి రోజు బంగారం, వెండి మాత్రమే కాదు శ్రీ యంత్రం కొనుగోలు చేసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది.



ధన త్రయోదశి రోజు కుదరకపోతే దీపావళి రోజు అయినా శ్రీ యంత్రారాధన చేస్తే శుభం జరుగుతుంది



ధన త్రయోదశి రోజు గోమతి చక్రం కొనుగోలు చేస్తే...ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు పండితులు.



11 గోమతి చక్రాలను కొనుగోలు చేసి పసుపు వస్త్రంలో కట్టి అమ్మవారి దగ్గర పూజ తర్వాత లాకర్లో పెడితే మంచి జరుగుతుందంటారు



దీపావళి పూజ సమయంలో లక్ష్మీదేవి దగ్గర ధనియాల విత్తనాలు పెట్టి వాటిని ఇంట్లో భద్రంగా దాచుకుంటే డబ్బు నిల్వ ఉంటుందని కొందరి విశ్వాసం.



దీపావళి సందర్భంగా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకే ఇంటిని శుభ్రం చేసే చీపుర్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు.



చీపురును లక్ష్మీ దేవి స్వరూపంగా చెబుతారు. అందుకే ఈ రోజు చీపురు కొంటే పేదరికం తొలగిపోతుందని విశ్వసిస్తారు.



దీపావళికి ఎలాగూ మట్టి ప్రమదిల్లో దీపాలు వెలిగిస్తారు. అందుకే మట్టి ప్రమిదలను ధన త్రయోదశి రోజు చేయడం చాలా మంచిది.



ఈ రోజు ఇంట్లోకి మట్టి దీపాలు తీసుకురావడం ద్వారా సుఖసంతోషాలు, సౌభాగ్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని పండితులు చెబుతారు