కళ్యాణ్ రామ్ స్పై థ్రిల్లర్ 'డెవిల్'లో ప్లస్, మైనస్‌లు ఏంటి? హైలైట్స్ ఏమున్నాయి? మినీ రివ్యూలో చూడండి. కథ: జమీందారు కుమార్తె హత్య కేసు దర్యాప్తుకు రాసపాడు వెళతాడు బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్). రాసపాడులో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో పనిచేసే ఐఎన్ఏ (ఆజాద్ హింద్ ఫౌజ్) మనుషులు ఉన్నారని తెలుస్తుంది. నేతాజీని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వానికి డెవిల్ ఎలా సాయం చేశాడు? రాసపాడులో అతను ఏం చేశాడు? నైషధ (సంయుక్తా మీనన్), మణిమేఖల (మాళవికా నాయర్), త్రివర్ణ (?) ఎవరు? నేతాజీని పెట్టుకున్నారా? లేదా? అనేది సినిమా. ఎలా ఉంది?: మర్డర్ మిస్టరీతో సగటు క్రైమ్ థ్రిల్లర్‌గా మొదలైన 'డెవిల్'... దేశభక్తి వైపు టర్న్ తీసుకుని... యాక్షన్ మూవీగా ముగిసింది. 'డెవిల్' కథా నేపథ్యం, నిర్మాత చేసిన ఖర్చు, యాక్షన్ సీన్లు, పాటలు బావున్నాయి. కానీ, ఫస్టాఫ్ కొంత ఇబ్బంది పెడుతుంది. 'డెవిల్'లో క్యారెక్టర్లు ఎక్కువ కావడంతో ఇంటర్వెల్ ముందు వరకు కథ మొదలు కాలేదు. ఆ తర్వాత ట్విస్ట్, టర్న్‌లు బావున్నాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాల్లో 'మాయ చేసే...' బావుంది. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయ్. యాక్షన్ సీన్లు, దేశభక్తి సీన్లు, కళ్యాణ్ రామ్ నటన మెప్పిస్తాయి. అంచనాలు లేకుండా వెళితే ఓసారి చూడొచ్చు.