దక్షా నగార్కర్.. ఈమె ఇప్పుడు కుర్రాళ్లకు అతి పెద్ద క్రష్. ఈ ముంబయి భామ చూపులతో కుర్రాళ్లను చంపేస్తోంది. 2014లో రిలీజైన ‘ఏకే రావు, పీకే రావు’ ఆమె ఫస్ట్ మూవీ. 2015లో ‘హోరా హోరీ’ సినిమాతో కాస్త గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘హుషారు’ సినిమాతో ఇండస్ట్రీలో సెటిలైపోయింది. ‘జాంబీ రెడ్డి’తో మాంచి హిట్ కొట్టి ‘బంగార్రాజు’ కంట్లో పడింది. కానీ, ‘బంగార్రాజు’లో ఒక పాటకే పరిమితమైంది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’లో ఛాన్స్ కొట్టేసింది. మరి, ఈ సినిమా అయినా దక్షాకు బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి. ఇటీవల దక్ష ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో దక్ష ‘ఏంట్రా’కు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ‘షన్ను’ డైలాగ్‌నూ వాడేసింది. షన్ను డైలాగును వాడితే వాడావు గానీ.. ‘ఏంట్రా’కు భలే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చావని ఫ్యాన్స్ అంటున్నారు. Credits: Daksha Nagarkar/Instagram