గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.63 శాతం పెరిగి రూ.20.22 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.98 శాతం పెరిగి రూ.1,38,224 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.17 శాతం తగ్గి రూ.82.74, బైనాన్స్ కాయిన్ 1.73 శాతం తగ్గి రూ.25,809, రిపుల్ 2.24 శాతం పెరిగి రూ.32.76, యూఎస్‌డీ కాయిన్ 0.10 శాతం తగ్గి రూ.82.72, కర్డానో 2.74 శాతం పెరిగి 32.53, డోజీ కాయిన్ 0.01 శాతం పెరిగి 7.08 వద్ద కొనసాగుతున్నాయి. లీజర్‌మెటా, ఈకాయిన్, ఫ్లోకి, అల్కెమీ పే, స్టాక్స్, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్, ఏఎంపీ లాభపడ్డాయి. యాక్సెస్ ప్రొటొకాల్, ఫంక్షన్ ఎక్స్, బ్లాక్స్, ఫైల్‌కాయిన్, సెల్సియస్ నెట్‌వర్క్, వాయెజర్ వీజీఎక్స్, టెన్‌సెంట్ నష్టపోయాయి.