బిట్‌కాయిన్ 0.85 శాతం పెరిగి రూ.21.92 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.28 శాతం పెరిగి రూ.1,34,819 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.01 శాతం తగ్గి రూ.83.02, బైనాన్స్ కాయిన్ 0.26 శాతం పెరిగి రూ.17,639, రిపుల్ 0.35 శాతం పెరిగి రూ.40.10, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం తగ్గి రూ.82.99, లిడో స్టేక్డ్ ఈథర్ 1.2533 శాతం పెరిగి రూ.1,34,797, డోజీ కాయిన్ 0.02 శాతం పెరిగి రూ.5.10 వద్ద కొనసాగుతున్నాయి. హైఫై ఫైనాన్స్, టెల్లార్ ట్రైబ్యూట్స్, వెటార్, గ్రోస్టెల్‌కాయిన్, బ్లాక్స్, సియాకాన్ లాభపడ్డాయి. క్రిప్టాన్ డావో, సీయూఎస్‌డీటీ, కాంపౌండ్, క్లైటాన్, ఫ్లేర్, ఏస్టర్, గెయిన్స్ నెట్‌వర్క్ నష్టపోయాయి.