స్టాక్‌ మార్కెట్లో సంపదను వృద్ధి చేయొచ్చని చాలామందికి తెలుసు! సుదీర్ఘ కాలం పెట్టుబడులు కొనసాగించడం వల్ల మంచి రాబడులు వస్తాయని ఎన్నోసార్లు నిరూపితమైంది.



ఎప్పుడు, ఎలాంటి స్టాక్‌లో ఎన్నాళ్లు పెట్టుబడి పెట్టాలన్నదే అసలు సమస్య.



ఇది తెలియకపోవడం వల్లే చాలామంది నష్టపోతుంటారు. లేదా అనుకున్నంత సందపను ఆర్జించలేకపోతున్నారు.



ఐదేళ్ల కాలంలో పది కంపెనీల షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడి పెట్టడం వల్ల ఇప్పుడు రూ.1.7 కోట్లు వచ్చిన ఉదాహరణ ఇది.



ఈ కాలంలో ఆ కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఇన్వెస్టర్లకు సంపదను పంచిపెట్టాయి.



అదానీ ట్రాన్స్‌మిషన్‌, దీపక్‌ నైట్రేట్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, తన్లా ప్లాట్‌ఫామ్స్‌, రుచి సోయా, అల్కలీ అమైన్స్‌, వైభవ్‌ గ్లోబల్‌, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌, పీ అండ్‌ జీ హెల్త్‌, ఎస్కార్ట్స్‌లో ఐదేళ్ల క్రితం పెట్టుబడి ఇప్పుడు భారీ స్థాయిలో వృద్ధి చెందింది.



2016-21 మధ్య కాలంలో అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఏకంగా 93 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.38 కోట్ల నుంచి రూ.999కి చేరుకుంది. ఈ కంపెనీ పీఈ నిష్పత్తి సైతం 10 నుంచి 82కు పెరిగింది.



ఇదే సమయంలో దీపక్‌ నైట్రేట్‌ 90, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 86, తన్లా ప్లాట్‌ఫామ్స్‌ 85, రుచిసోయా 81, అల్కలీ అమైన్స్‌ 79, వైభవ్‌ గ్లోబల్‌ 64, అపోలో ట్యూబ్స్‌ 60, పీ అండ్‌ జీ హెల్త్‌ 57, ఎస్కార్ట్స్‌ 56 శాతం సీఏజీఆర్‌ సాధించాయి.



ఆసక్తికరంగా ఇందులో 7 కంపెనీల పీఈ రేషియో ఐదేళ్ల క్రితం 20లోపే ఉండటం గమనార్హం.



అంటే తక్కువ పీఈ రేషియో ఉండి వేగంగా అభివృద్ధి సాధించే కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను సృష్టించొచ్చు.