ఈ రెండు రాశుల వారు పెళ్లిచేసుకుంటే ఇంట్లో నిత్య కురుక్షేత్రమే



కొన్ని రాశులు మధ్య సమన్వయం ఉంటుంది, మరికొన్నింటి మధ్య మాత్రం పొత్తు కుదరదు. పొత్తు కుదరని రాశులకు చెందిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటే వారి సంసారమంతా ఫైటింగులేనట.



ఏఏ రాశుల వారు పెళ్లి చేసుకోకూడదో, ఏ రాశుల మధ్య పొత్తు కుదరదో చూద్దాం



మేషం-వృశ్చికం
ఈ రెండు రాశులవారు ప్రతి విషయంలోనూ పోటీపడే తత్వం ఉన్నవాళ్లే. అంతేకాదు గోప్యతను ఇష్టపడే వ్యక్తులు. వీరిద్దరి మధ్య ప్రారంభ రోజుల్లో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ రాను రాను ఆధిపత్యపోరు మొదలవుతుంది.



కర్కాటకం - కుంభం
కర్కాటక రాశి వారు ప్రతిది తమకు తెలిసే జరగాలని కోరుకుంటారు. కుంభరాశి వారు మాత్రం స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. కుంభరాశి వారికి శక్తిమంతమైన భాగస్వాములు సెట్ అవుతారు. కర్కాటకరాశి వారు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నిత్యం ఇంట్లో మెలో డ్రామాలే.



వృషభం- ధనుస్సు
ఈ రెండు రాశుస వారి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. వృషభరాశి వారు కుటుంబం, ఇల్లు, పనికే ప్రాధాన్యనిస్తారు. కానీ ధనుస్సు రాశి వారు షికార్లు చేసేందుకు ఇష్టపడతారు. ఈ రెండు రాశులు కలిస్తే సక్సెస్ అయ్యే జంటలు కొన్నే ఉంటాయి. లేదంటే ఇల్లు కురుక్షేత్రమే.



మేషం-వృషభం
మేష రాశి వారు నిమిషాల మీద నిర్ణయాలు తీసుకుంటారు. అన్నీ అకస్మాత్తుగా చేసేస్తుంటారు. వృషభరాశి వ్యక్తులు మాత్రం స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారు, నెమ్మదిగా ఉంటారు. ఇద్దరి ఓపిక స్థాయిలు మ్యాచ్ కావు.



మకరం-ధనుస్సు
మకరరాశి వారు ఎవరైనా ఏమైనా అంటే ఆ మాటలను పాజిటివ్ గా తీసుకోలేరు. కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి కూడా తక్కువే. కానీ ధనుస్సు రాశి వారు కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరికి ఇంట్లో జరిగే విషయాలపై రాజీ కుదరితే ఓకే లేదంటే పెద్ద తగాదాలకు దారి తీస్తుంది.



సింహం-కన్యా
ఈ రెండు రాశులవారికి విపరీతమైన గర్వం. కన్యా రాశివారు తమ భావోద్వేగాలను ప్రదర్శించరు. సింహరాశి వారు భావోద్వేగ ప్రకోపాలను కలిగి ఉంటారు. అందుకే వీరిద్దరి మధ్య నిత్య వివాదాలు తప్పవు.