పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే పోషకాహారం లోపం ఉన్నట్టే...

పిల్లలకు ఆరోగ్యకరమైన పోషకాహారం ఇవ్వాలి. అదే వారికి మానసిక, శారీరక ఆరోగ్యానికి అత్యవసరం.

పోషకాహారం అందితేనే పిల్లలు అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు.

సరైన పోషకాహారం అందని పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

పోషకాహారలోపం వల్ల అకస్మాత్తుగా బరువు పెరగడం, లేదా బరువు తగ్గిపోవడం జరుగుతుంది.

తరచూ పిల్లలు జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడుతుంటారు.

మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. త్వరగా కోపం తెచ్చుకుంటారు.

శక్తి లేనట్టు నీరసంగా కనిపిస్తారు. చురుకుగా ఉండరు.

ఏదైనా చెప్పినా త్వరగా అర్థం చేసుకోలేరు. చదువు కూడా సరిగా రాదు.

దేనిపైనా ఏకాగ్రత చూపలేరు.