టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 



ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.



ఇటీవల తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించింది సమంత. ఆ బాధ నుంచి బయటికి వచ్చేందుకు తనను తాను ఎంతో మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.



స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి తీర్థయాత్రలు చేసింది. ఛార్ ధామ్ యాత్రను పూర్తి చేసింది. 



మరోపక్క వరుస సినిమాలు ఒప్పుకుంటుంది.



తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది. 



ఇప్పటికే మూడు సినిమాల అనౌన్స్మెంట్స్ రాగా.. త్వరలోనే మరిన్ని సినిమాలను అనౌన్స్ చేయనుంది. 



ఇటీవల కడప టూర్ కి వెళ్లిన ఈ బ్యూటీ స్వల్ప అస్వస్థతకు గురైంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. 



త్వరలోనే తన సినిమాల రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనుంది సమంత.