సచిన్ వారసురాలు సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా లావెండర్, బ్లూ షిమ్మరింగ్ లెహెంగాలో సారా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లెహెంగాలో తను పువ్వులతో ఆడుకుంటూ షేర్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సారా టెండూల్కర్ ఫోటోషూట్స్ చూస్తుంటే తను కచ్చితంగా హీరోయినే అవుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ తన గోల్ ఏంటి? తను ఏమవ్వాలని అనుకుంటుంది అనే విషయాన్ని సారా ఎప్పుడూ ఓపెన్‌గా చెప్పలేదు. ఒకవేళ సారా బాలీవుడ్‌లో అడుగుపెడితే చాలామంది హీరోయిన్లకు పోటీ వస్తుందని తన ఫ్యాన్స్ అంటుంటారు. సారా టెండూల్కర్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పటికప్పుడు రూమర్స్ వైరల్ అవుతుంటాయి. ఇండియన్ యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా లవ్‌లో ఉందని రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ తన పర్సనల్ లైఫ్‌పై వచ్చే రూమర్స్‌పై సారా ఎప్పుడూ క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదు. All Images And Video Credit: Sara Tendulkar/Instagram