హార్థిక పాండ్యా నిజంగా రిలేషన్లోకి వెళ్లాడా? ఆ గర్ల్ ఫ్రెండ్ ఈమేనా? ప్రేమించి.. పేరెంట్సై.. పెళ్లి చేసుకున్నారు హార్థిక్ పాండ్యా, నటాషా. వీరిద్దరూ విడిపోయారంటూ కొన్ని రూమర్స్ రాగా.. వాళ్లు దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అవును మేము నిజంగానే విడిపోతున్నామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టేశారు. ఇప్పుడు హార్థిక్ సింగిల్ అనుకుంటున్నారేమో.. అస్సలు కాదంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వెకేషన్ వీడియో పోస్ట్ చేసిన హార్థిక్ పాండ్యా. ఈ బ్రిటిష్ సింగర్ కూడా అదే లోకేషన్లో వీడియో పోస్ట్ చేసింది. తాజాగా హార్థిక్ పాండ్యా, బ్రిటీష్ సింగర్ జాస్మిన్ వాలియా వెకేషన్‌కి వెళ్లారు. అయితే వీరిద్దరూ తమ తమ ఫోటోలు, వీడియోలు షేర్ చేసినా.. ఫ్యాన్స్ మాత్రం కనిపెట్టేశారు. ఇద్దరూ ఒకే లోకేషన్లో ఉన్నారు. వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పోస్ట్‌లు వేస్తున్నారు. డివోర్స్ తర్వాత హార్థిక్ త్వరగానే మూవ్ అయిపోయాడంటున్నారు. (Images Source : Instagram/hardikpandya93,Jasmin Walia)