నాని 'గ్యాంగ్ లీడర్'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన తమిళమ్మాయి ప్రియాంకా అరుల్ మోహన్. తమిళ అనువాద సినిమా 'డాక్టర్'తో గతేడాది తెలుగులో విజయం అందుకున్నారు. ఈ ఏడాది 'డాన్' సినిమాతో మరో హిట్ అందుకున్నారు. 'డాన్', 'డాక్టర్'... రెండు సినిమాల్లోనూ శివకార్తికేయన్ హీరో. శివ కార్తికేయన్, ప్రియాంక జోడీ బావుందని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలోనూ ప్రియాంక అవకాశం అందుకున్నారని టాక్. ప్రియాంకా అరుల్ మోహన్ కు తెలుగు సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తోంది. ప్రియాంకా అరుల్ మోహన్ (All images courtesy: Priyanka Mohan / Instagram)