సత్య ఐపీఎస్ అంటే రౌడీలకు హడల్, గుండాలకు గుబుల్. ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌గా ఉస్తాద్ రామ్ నటిస్తున్న చిత్రం 'ది వారియర్'.

రీసెంట్‌గా రామ్ 'ది వారియర్' టీజర్ విడుదలైంది. అందులో డైలాగ్స్ ఒక్కసారి చూడండి.

ఈ పోలీసోళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం. ఇంతకు ముందు సైలెంట్‌గా ఉండేటోళ్ళు. ఇప్పుడు వైలెంట్‌గా లోపలేస్తాండారు

ఈ మధ్య సత్య అని ఒకడు వ‌చ్చున్నాడు... వాడియమ్మా! ఒక్కొక్కడికి పెడుతున్నాడు. 

ఒకటప్పా... కొట్టిన వెంటనే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేస్తాడు. అట్టా కొడతాడు... టాబ్లెట్ ఇస్తాడు - రామ్ క్యారెక్టర్ గురించి రిడిన్ కింగ్‌స్లే 

మై డియర్ గ్యాంగ్‌స్ట‌ర్స్‌ వీలైతే మారిపోండి, లేకపోతే పారిపోండి. ఇదే నేను మీకు ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ - రామ్

పాన్ ఇండియా సినిమా చూసుంటారు. పాన్ ఇండియా రౌడీస్‌ను చూశారా? - రామ్

డిప్యూటీ సూప‌ర్‌డెంట్ ఆఫ్ పోలీస్ సత్య పోరీని నేను - కృతి శెట్టి

ఆట బానే ఉంది, ఆడేద్దాం - ఆది పినిశెట్టి

ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చినవాళ్ళను కొట్టడం కాదు, వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం - నదియా

లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్' జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.