అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన తొలి సినిమా 'దఢక్'కు ప్రేక్షకాదరణ లభించింది. దీంతో ఆమెకి సినీ అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆమె నటించిన పలు సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఆమె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'గుంజన్ సక్సేనా', 'రూహి' లాంటి సినిమాలు లాక్ డౌన్ లో ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోనప్పటికీ జాన్వీ నటనకు మంచి పేరొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ', 'దోస్తానా 2' వంటి సినిమాల్లో నటిస్తోంది. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కవ్విస్తుంటుంది. తాజాగా ఈమె గోల్డ్ కలర్ డ్రెస్ ధరించి ఓ ఫొటోషూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.