డయాబెటిస్ ఉంటే మామిడి పండ్లు తినొచ్చా? మామిడిపండ్లు ఎంతో మంది ఫేవరేట్. వేసవిలో మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. కమ్మని రుచి మాత్రమే కాదు, ఎన్నో పోషకాలు కూడా ఈ పండ్ల నుంచి లభిస్తాయి. మరి మధుమేహం ఉన్న వారు మామిడి పండ్లు తినవచ్చా? చాలా మంది మామిడిపండును మధుమేహులు తినవద్దని చెబుతారు. కారణం అందులో 90 శాతం చక్కెరే ఉంటుంది. మామిడి పండు తింటే మీ చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువ. అయితే ఈ పండు గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 51. కాబట్టి మామిడిపండ్లను మితంగా తింటే మధుమేహులకు మంచిదే. రోజూ తినాలనిపిస్తే ఒకటి లేదా రెండు ముక్కలకు మించి తినకూడదు. అధికంగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.