టమోటాలను పొడి చేసి ఇలా దాచుకోండి

టమోటాలను పొడి చేసి ఇలా దాచుకోండి

టమోటాల ధరలు తక్కువగా ఉన్నప్పుడు వాటిని పొడి చేసుకుని దాచుకుంటే కూరల్లో వాడుకోవచ్చు.

ఈ పొడి కూరల్లో వేసుకుంటే రుచితో పాటూ అధికంగా ఇగురు వస్తుంది.

టమోటాలను గుండ్రంగా చక్రాల్లా పలుచగా కోసుకోవాలి. ఎర్రటి ఎండలో ఎండబెట్టాలి.

టమోటాలలో తేమ లేకుండా బాగా ఎండేలా చూడాలి. ఒక గిన్నెలో ఆడిస్తే గలగల మంటూ శబ్ధం రావాలి.

ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్లో వేసి పొడిని దాచుకోవాలి.

బరకగా చేసుకున్నా ఫర్వాలేదు. కూరలో వేసి ఉడికిస్తే మెత్తని ఇగురులా మారిపోతుంది.

ఎండబెట్టడం వల్ల టమోటాలకుండే సహజ రుచి పోదు.

గుజ్జుగా దాచుకోవాలనుకునేవారు టమోటాలను గుజ్జులా చేసి పసుపు కలపాలి.

ఉప్పు కూడా చేరిస్తే నాలుగైదు నెలలు పాడవకుండా ఉంటుంది. కాకపోతే దీన్ని కచ్చితంగా డీప్ ఫ్రిజ్ లోనే పెట్టాలి.