అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 5000కు పైగా పరుగులు, 100కు పైగా వికెట్లు తీసిన అతికొద్ది మంది క్రికెటర్లలో ఒకడు. 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లు గెలిచిన జట్లలో సభ్యుడు. ఐసీసీ వరల్డ్ ఎలెవన్ తుదిజట్టులో రెండు సార్లు, 12వ ఆటగాడిగా మూడు సార్లు చోటు సంపాదించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 16 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడు. ఈ రికార్డు 20 సంవత్సరాల తర్వాత బద్దలయింది. ఐపీఎల్ మొదటి వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న విదేశీ ఆటగాడు. (రూ.5.4 కోట్లు) వన్డేల్లో ఆరో స్థానంలో రెండో అత్యధిక స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్. (143 పరుగులు) అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో ఐదో స్థానంలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా తన పేరునే ఉంది. (156 పరుగులు) వన్డేల్లో 1,000 పరుగులు, 50 వికెట్లు, 50 క్యాచ్‌లు తన ఖాతాలో ఉన్నాయి. ఐదో వికెట్‌కు ఇది ఐదో అత్యధిక భాగస్వామ్యం.