సరికొత్త రుచి మీకెంతో నచ్చేస్తుంది. పచ్చి బఠానీలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
పచ్చిబఠాణీలు - కప్పు శెనగపిండి - అరకప్పు ఉల్లిపాయ - ఒకటి అల్లం - చిన్న ముక్క వెల్లుల్లి రెబ్బలు - అయిదు పచ్చిమిర్చి - మూడు కొత్తి మీర - ఒక కట్ట ఉప్పు - తగినంత నూనె - దోశె వేయడానికి సరిపడా
పచ్చిబఠానీలు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
ఆ రుబ్బులోకి శెనగపిండి, ఉప్పు వేసి కలపాలి.
దోశె వేసేంత జారుడుగా రాకపోతే రుబ్బులో కాస్త నీళ్లు కలుపుకోవచ్చు.
జీలకర్ర కూడా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ రాసి దోశెను వేసుకోవాలి.
ఈ దోశెను కొబ్బరి చట్నీ, టమాటా చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.