మెగా కోడలు ఉపాసన ఒక సమయంలో తాను డిప్రెషన్‌కు వెళ్లానంటూ షాకింగ్ విషయం చెప్పారు

పెళ్లయిన పదేళ్లకు గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసనలు తల్లిదండ్రులుగా ప్రమోట్‌ అయ్యారు

వారసురాలి రాక మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి

అయితే తాజా ఓ ఇంటర్య్వూలో ఉపాసన డెలివరి తర్వాత డిప్రెషన్‌కు వెళ్లానని చెప్పారు

చాలామంది మహిళలాగే నేను కూడా డెలివరి తర్వాత తీవ్ర ఒత్తిడికి (పోస్ట్‌పార్టమ్‌ డిప్రెషన్‌) లోనయ్యాను

అప్పుడు నా భర్త రామ్‌ చరణ్‌ నా థెరపిస్ట్‌గా మారారు. ప్రతి క్షణంగా నాకు అండగా ఉన్నాడు

నాతో పాటు నా పుట్టింటికి కూడా వచ్చేవాడు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని

ఇలాంటి అదృష్టం అందరికి ఉండదు. భార్య తల్లిగా మారే సమయంలో భర్త సపోర్ట్‌ అనేది చాలా అవసరం

మహిళలు తల్లిగా మారే క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కానీ ఇదొక అద్భుతమైన ప్రయాణం.

Image Source: all Image Credit: upasanakaminenikonidela/Instagram

ఇక క్లింకార విషయంలో చరణ్‌ చూపించే కేరింగ్‌, లవ్‌ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు