పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలు అకిరా, ఆద్యాలతో ఒంటిరిగా జీవిస్తున్నారు పవన్ కళ్యాణ్‌తో పెళ్లి అనంతరం సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్నారు మరోవైపు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే తరచూ అకిరా, అద్యాల వీడియోలతో పాటు సామాజిక, రాజకీయాల అంశాలపై స్పందిస్తుంటారు ముఖ్యంగా తన పిల్లల టాలెంట్‌కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ తల్లిగా మురిసిపోతుంటారు తాజాగా అకిరాకు సంబంధించిన ఓ ఆసక్తిర వీడియో షేర్ చేశారు రేణుదేశాయ్ 'నా సమురై బేబీ' అంటూ అకిరా కర్రతో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు ఇది చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. తండ్రి బాటలోనే అకిరా కూడా మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం తెచ్చుకున్నాడంటున్నారు ప్రస్తుతం అకిరా మార్షల్ ఆర్ట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.