చిరంజీవి 'విశ్వంభర' 2025 సంక్రాంతి మీద కర్చీఫ్ వేసింది. దాంతో పాటు ఏయే సినిమాలు రానున్నాయో చూడండి.

ప్రభాస్, మారుతి సినిమా 'రాజా సాబ్' సంక్రాంతికి వచ్చే ఛాన్సులు ఉన్నాయి.

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించే సినిమా 2025 సంక్రాంతికి రానుంది. 

రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమయ్యే సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 

సంక్రాంతికి 'హనుమాన్'తో హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ, ప్రతి సంక్రాంతికి ఓ సినిమా తెస్తానన్నారు. 'జై హనుమాన్' 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. 

ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'శతమానం భవతి' సీక్వెల్ 'శతమానం భవతి నెక్స్ట్ పేజీ'ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. 

ఈ ఏడాది సంక్రాంతికి 'నా సామి రంగ'తో వచ్చిన నాగార్జున వచ్చే ఏడాది మరో సినిమా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. 

హిందీలో చిన్న సినిమా 'ఎక్కిస్' అనే సినిమా వచ్చే ఏడాది జనవరి 10న విడుదలకు రెడీ అయ్యింది.