హీరోయిన్ పూజా హెగ్డె చాలా కాలం నుంచి నటిస్తున్నారు. మరి ఆమె వయసు ఎంత?

పూజా హెగ్డే 1990 అక్టోబర్ 13న జన్మించారు. ప్రస్తుత ఆమె వయసు 35 సంవత్సరాలు.

ముంబైలో జన్మించి, అక్కడే పెరిగారు.

2010లో జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా' పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.

2012లో జీవా సరసన వచ్చిన తమిళ చిత్రం మూగమూడి తెలుగులో మాస్క్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు.

తెలుగులో 2014లో నాగచైతన్య సరసన నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.

అల్లు అర్జున్ సరసన నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది.

హృతిక్ రోషన్ సరసన ప్రతిష్టాత్మక చిత్రం ‘మొహెంజొదారో’ తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

ఆమెకు తన మాతృభాష తులుతో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కన్నడ భాషలు వచ్చు.

35 ఏళ్ల వయసులోనూ పూజా హెగ్డే అత్యంత ఫిట్‌గా, గ్లామరస్‌గా ఉండటానికి ఆమె కఠిన కసరత్తులు చేస్తారు.