హైదరాబాద్‌లో పాపులర్ యూట్యూబర్ మర్డర్... బావమదిరి చంపేశాడా? కారణం ఏమిటంటే?

Published by: S Niharika

ఫిట్నెస్ కంటెంట్ క్రియేటర్, యూట్యూబర్ మసూద్ చాందీ అలియాస్ షేక్ మెహబూబ్ ను శుక్రవారం (జూన్ 12న) హైదరాబాద్ లోని గోల్కొండలో ఉన్న అతని ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు

Published by: S Niharika

మసూద్‌పై పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అక్కడికక్కడే మరణించాడు

Published by: S Niharika

పోలీసులకు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించాయి. జూన్ 12న మధ్యాహ్నం 3.20 నుంచి 3.30 గంటల మధ్య హత్య జరిగిందని తెలుస్తోంది.

Published by: S Niharika

మెహబూబ్ దారుణ హత్యలో మృతుడి బావ, అతని స్నేహితులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Published by: S Niharika

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణ గౌడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం... ప్రధాన నిందితుడు షేక్ సోహెల్, మెహబూబ్ భార్యకు సోదరుడు. తన ఇద్దరు స్నేహితులు అఫూ, జాబీర్ తో కలిసి అకస్మాత్తుగా మెహబూబ్ ఇంట్లోకి ప్రవేశించాడు.

Published by: S Niharika

ప్రణాళిక ప్రకారం మెహబూబ్ పై కత్తులు, ఇనుప రాడ్ తో పదేపదే దాడి చేయడంతో... తీవ్ర గాయాలుతో మెహబూబ్ అక్కడికక్కడే మరణించాడు

Published by: S Niharika

పోలీసుల విచారణలో... మెహబూబ్ ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతనికి 6 నెలల బిడ్డ ఉంది. ఇటీవల కుటంబ కలహాల కారణంగా భార్యను బిడ్డతో సహా పుట్టింటికి పంపించాడు.

Published by: S Niharika

సోదరిని ఇంటికి పంపించడంతో మోహమూబ్ మీద బావమరిది సోహెల్ ఆగ్రహం పెంచుకున్నాడు. కోపంతో రెచ్చిపోయి సోహెల్ తన సహచరులతో కలిసి ఈ హత్య చేశాడు.

Published by: S Niharika

మృతుడి తల్లి షాహీన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 1031 హత్య కింద కేసు నమోదు చేశారు.

Published by: S Niharika