ఛాట్ జీపీటీకి పోటీగా గూగుల్ ‘బార్డ్’ అనే ఏఐ బోట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.



ఇది ప్రస్తుతానికి కొంతమంది నమ్మకమైన టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.



దీని కోసం గూగుల్ సీఈవో కొంతమందిని ఎన్‌రోల్ చేశారు.



ఫ్రెష్, హై క్వాలిటీ రెస్పాన్స్‌లను ఇది అందించనుందని సుందర్ పిచాయ్ అన్నారు.



దీన్ని రెస్పాన్సిబుల్‌గా ఉన్న ఏఐగా సుందర్ పిచాయ్ అభివర్ణించారు.



బార్డ్ అందుబాటులోకి రాగానే, మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీని బింగ్ బ్రౌజర్‌లోకి తీసుకువచ్చింది.



బార్డ్ మాత్రమే కాకుండా గూగుల్ మరిన్ని మార్గాల ద్వారా ఏఐని తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది.



గూగుల్ లెన్స్ ద్వారా సెర్చ్‌ను కూడా ఎన్‌హేన్స్ చేయనున్నారు.



దీంతో పాటు మల్టీ సెర్చ్ ప్లస్ ఏఐ లెన్స్ కూడా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.



ఈ మల్టీ సెర్చ్ ప్లస్ రెస్పాన్స్‌కు ఏఐ పుష్ కూడా లభించనుంది.