నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 18,972 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 499 పాయింట్లు పెరిగి 63,915 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ 206 పాయింట్లు పెరిగి 44,327 వద్ద క్లోజైంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, బజాజ్ ఆటో, సన్‌ఫార్మా షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, హీరోమోటో కార్ప్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.05 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.220 తగ్గి రూ.58,960గా ఉంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.71,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.340 తగ్గి రూ.24,190 వద్ద ఉంది. బిట్‌కాయిన్ 0.17 శాతం తగ్గి రూ.24.87 లక్షల వద్ద కొనసాగుతోంది.