నిఫ్టీ 92 పాయింట్లు తగ్గి 19,436 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 286 పాయింట్లు తగ్గి 65,226 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 435 పాయింట్ల నష్టంతో 43,964 వద్ద ముగిసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (3.23%), నెస్లే ఇండియా (3.03%), ఐచర్ మోటార్స్ (1.63%), హిందుస్థాన్ యునీలివర్ (1.61%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (1.59%) షేర్లు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంకు (4.72%), ఎస్బీఐ (2.94%), ఎన్టీపీసీ (2.38%), ఇండస్‌ఇండ్ బ్యాంకు (2.33%), బజాజ్ ఆటో (2.20%) నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 3 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది. బంగారం 10 గ్రాముల ధర రూ.10 తగ్గి రూ.57,370 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.70,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.23,090 వద్ద ఉంది. బిట్ కాయిన్ రూ.22.96 లక్షల వద్ద కొనసాగుతోంది.