చాణక్య నీతి: ఈ మూడూ డబ్బు కంటే చాలా చాాలా విలువైనవి
సాధారణంగా డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది అనుకుంటారు. డబ్బుంటేనే ఏదైనా సాధ్యమే అనుకుంటారు, ఏమైనా చేయొచ్చనుకుంటారు. ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుందని భావిస్తారు.
కానీ ఈ మూడు విషయాలు డబ్బు కన్నా చాలా విలువైనవని చెప్పాడు చాణక్యుడు. ఇవి కోల్పేతే మళ్లీ తిరిగి తెచ్చుకోలేం అన్నాడు.
1.మతం డబ్బు కన్నా మతం పెద్దది. ఏదైనా పొందాలనే ముసుగులో, ఆర్థిక లాభాలను ఆశించో మతాన్ని వదులుకోకూడదు. ఎందుకంటే తప్పొప్పులు గుర్తించి మనిషిని సరైన మార్గంలో నడిపించేదే మతం.
మతం ముసుగులో వచ్చే డబ్బుని ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోరాదు. మతం మంచి చేస్తుంది కానీ డబ్బు మాత్రం చెడును మూటగట్టి ఇస్తుంది
2. సంబంధాలు నిజమైన సంబంధాలు కలిగి ఉండడం, వాటిని గుర్తించడం చాలా గొప్ప విషయం, అత్యంత కష్టం కూడా. ఇలాంటి వారి ముందు డబ్బుకి విలువ తక్కువే అని ఒప్పుకోవాలంటాడు చాణక్యుడు
ప్రపంచంలో అన్ని ఆనందాలను డబ్బుతో కొనుగోలు చేయొచ్చుకానీ ఒకరి ప్రేమను మాత్రం ఎంత ఖర్చు చేసినా కొనలేరు. కష్టం, సుఖంలో అండగా నిలిచే స్నేహితుడు, శ్రేయోభిలాషి లేదా బంధువు కోసం ఎంత డబ్బు వదిలేసుకున్నా తక్కువే అంటాడు చాణక్యుడు
3. ఆత్మ గౌరవం ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఆత్మగౌరవం కన్నా గొప్పది ఏమీ ఉండదు..ఉండకూడదంటాడు చాణక్యుడు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు డబ్బు త్యాగం చేయాల్సి వస్తే అస్సలు ఆలోచించకూడదంటాడు
కోల్పోయిన డబ్బు తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ఆత్మగౌరవాన్ని తిరిగి తెచ్చుకోలేరన్నది గుర్తించాలని చెప్పాడు చాణక్యుడు..
మతం, మానవ సంబంధాలు, ఆత్మగౌరవం.. ఈ మూడు మనీ కన్నా పవర్ ఫుల్ అని అందుకే చెప్పాడు ఆచార్య చాణక్యుడు